Posts

Showing posts from October, 2025

ఈ మధ్య నెల్లూరులో వర్షాలు

 నెల్లూరు వాతావరణం చాలా రోజులుగా నెల్లూరు లో వర్షాలు లేవు లేవనుకుంటుంటే, ఈ మధ్య కొన్ని రోజులుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వర్షాలు ఒక మోత మోగిస్తూ ఉంటే, వాతావరణ శాఖ నైఋతి రుతుపవనాలు ముగియడానికి ముందు వర్షాలు ఉధృతంగా కురుస్తాయి అని చాటింది. నైఋతి రుతుపవనాలు ఇంక రెండు రోజుల్లో ముగుస్తాయి, తరువాత ఈశాన్య ఋతుపవనాలు మొదలౌతాయి అని చాటింపు వినబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షాలు ఎడా పెడా వాయించడం అంటే ఇదేనేమో!  ఈరోజైతే అవి మామూలు వర్షాలు కావు. పక్షులు, ఇతర జీవరాశులు ఆహారం కోసం బయటకు రాలేక పోతున్నాయి. ఇంకా మనుష్యులలో బీదా బిక్కి, తలమీద కప్పులేకుండా నివసించే వారు, నిరాశ్రయులు, ఆశ్రయం కోసం, ఆహారం కోసం అలమటించే జనం … తలచుకుంటే భయమేస్తుంది. ఆ దేవునికి కృతజ్ఞతలు, ఎందుకంటే మనల్ని ఆ జనంలో పడవేయలేదు. ఏమో, ఒక వేళ అలా చేసి ఉంటే దానికి తరుణోపాయం కూడా ఆయనే చూపి ఉండేవారేమో!